ఆడ-జన్మ-అపురూపం

పుట్టింది పుట్టింది పుత్తడి బొమ్మలా… నవ్వింది నవ్వింది తన జన్మే అపురూపమని… కళ్ళే తెరచి చూసినే తను నడిచే దారి ఏదని… చిన్ని చిన్ని అడుగులు వేసినే తన దారిలోనే… మెల్ల మెల్ల గ రప్పించినే అనుబంధమైన వాళ్ళని… ముద్దు ముద్దు పలుకలతో చిలిపి చేష్టలే చేస్తూ… ఇంటికే అందం తీసుకోచెనే తను ఎదుగుతూనే… పుట్టింది పుట్టింది పుత్తడి బొమ్మలా… నవ్వింది నవ్వింది తన జన్మే అపురూపమని… ఘల్లు ఘల్లు మని గజ్జెలతో సవ్వడి చేస్తూ, ఎదనే తట్టేనే… […]
aada-janma

by NaSo

Apr 30, 2016

పుట్టింది పుట్టింది పుత్తడి బొమ్మలా…
నవ్వింది నవ్వింది తన జన్మే అపురూపమని…

కళ్ళే తెరచి చూసినే తను నడిచే దారి ఏదని…
చిన్ని చిన్ని అడుగులు వేసినే తన దారిలోనే…
మెల్ల మెల్ల గ రప్పించినే అనుబంధమైన వాళ్ళని…
ముద్దు ముద్దు పలుకలతో చిలిపి చేష్టలే చేస్తూ…
ఇంటికే అందం తీసుకోచెనే తను ఎదుగుతూనే…

పుట్టింది పుట్టింది పుత్తడి బొమ్మలా…
నవ్వింది నవ్వింది తన జన్మే అపురూపమని…

ఘల్లు ఘల్లు మని గజ్జెలతో సవ్వడి చేస్తూ, ఎదనే తట్టేనే…
చదువు సంద్యల కోసమని, ఆడపిల్ల నన్న సంగతే మరిచి..
విద్యనభ్యసించి తనకంటూ పేరు తెచుకొనెనె..
కట్టు బాటులకి కట్టుబడి,మూడు ముళ్ళ బందానికి తల వంచితినే…
కన్న తల్లి దండ్రులని విడిచి తనలోనే తానే బాధ పడితినే..

పుట్టింది పుట్టింది పుత్తడి బొమ్మలా…
నవ్వింది నవ్వింది తన జన్మే అపురూపమని…

కన్న బిడ్డ తో పుత్తడి బొమ్మ కాస్త తల్లి అయినే..
తనలాంటి కష్టాలు బిడ్డకు రాకూడదని పెంపకానికే వన్నె తీసుకోచెనే..
తన తల్లిపాలు అమృతమై, బిడ్డకే ఆయుస్సు పెంచెనే..
తల్లి ప్రేమ కి మించిన ప్రేమే లేదని చాటి చెప్పెనే…
ఈ పుత్తడి బొమ్మ తొలి దైవమై, ప్రపంచాన్నే జయించెనె…
ఈ పుత్తడి బొమ్మే లేని ఈ సృష్టే ఉండదని రుజువు చేసెనే…

పుట్టింది పుట్టింది పుత్తడి బొమ్మలా…
నవ్వింది నవ్వింది తన జన్మే అపురూపమని…

About the Author

Related Posts

ఈ మాట నాది కాదు (E Maata Nadi Kadu)
ఈ మాట నాది కాదు (E Maata Nadi Kadu)

E Maata Nadi Kadu (ఈ మాట నాది కాదు) కోరితే తీరేది కోరిక కాదు, చేరితే చేరేది గమ్యం కాదు, మర్చితే పోయేది జ్ఞ్యాపకం కాదు, ఈ మాట నాది కాదు, నీది కాదు, నీతి కాదు !! వ్యథ లేని జీవితం వ్యర్థం, ఎదురు లేని మనిషి శూన్యం, దెబ్బ లేని పయనం అశేషం,  ఈ మాట నాది కాదు, నీది కాదు, నీతి...

ఏది జీవితం ?
ఏది జీవితం ?

సమాధానం లేని ప్రశ్నలు అర్థం లేని సంకేతాలు ముగింపు లేని పరుగులు అవసరం లేని అనుమానాలు నిజాలు లేని నమ్మకాలు ఎల్లలు లేని కోరికలు                                           ఇదేనా జీవితం !! వేళలు లేని వేడుకలు విలువలు లేని గౌరవాలు ఆప్యాయత లేని ప్రేమలు ఎదురు చూడలేని ఓపికలు...

ఈ ఆనందం ఎవరి ఆహ్వానం వల్లనో !!
ఈ ఆనందం ఎవరి ఆహ్వానం వల్లనో !!

బిగిసిన పెదవుల వెంటనా పదాలు అలసిన చెమటల వెంటనా ఆతృత కలిసిన రెప్పల వెంటనా కలలు తెలిసెనే నీవు చెప్పకనే!! చెదరని నీటిలో ప్రతిలా బెదిరిన ఆకులో వణుకులా ఎదురున వాకిట్లో వల్లిలా పోలికలేని ఈ పలుకులేలనే !! ఆక్షరం అక్షరం ఒకటై పదమై పదము పదము ఒకటై పద్యమై పద్యము పద్యము ఒకటై పాఠమై...

Comments

0 Comments