బిగిసిన పెదవుల వెంటనా పదాలు
అలసిన చెమటల వెంటనా ఆతృత
కలిసిన రెప్పల వెంటనా కలలు
తెలిసెనే నీవు చెప్పకనే!!
చెదరని నీటిలో ప్రతిలా
బెదిరిన ఆకులో వణుకులా
ఎదురున వాకిట్లో వల్లిలా
పోలికలేని ఈ పలుకులేలనే !!
ఆక్షరం అక్షరం ఒకటై పదమై
పదము పదము ఒకటై పద్యమై
పద్యము పద్యము ఒకటై పాఠమై
పాఠము పాఠము ఒకటై పుస్తకమైనట్లు
నాతో నేనే ఒకటై మరో నేనైనట్లుంది !!
ఎన్నడూ లేని ఈ ఆనందం ఎవరు పంపిన ఆహ్వానం వల్లనో??
0 Comments