ఈ మాట నాది కాదు (E Maata Nadi Kadu)

ఈ మాట నాది కాదు (E Maata Nadi Kadu)

E Maata Nadi Kadu (ఈ మాట నాది కాదు) కోరితే తీరేది కోరిక కాదు, చేరితే చేరేది గమ్యం కాదు, మర్చితే పోయేది జ్ఞ్యాపకం కాదు, ఈ మాట నాది కాదు, నీది కాదు, నీతి కాదు !! వ్యథ లేని జీవితం వ్యర్థం, ఎదురు లేని మనిషి శూన్యం, దెబ్బ లేని పయనం అశేషం,  ఈ మాట నాది కాదు, నీది కాదు, నీతి...
ఏది జీవితం ?

ఏది జీవితం ?

సమాధానం లేని ప్రశ్నలు అర్థం లేని సంకేతాలు ముగింపు లేని పరుగులు అవసరం లేని అనుమానాలు నిజాలు లేని నమ్మకాలు ఎల్లలు లేని కోరికలు                                           ఇదేనా జీవితం !! వేళలు లేని వేడుకలు విలువలు లేని గౌరవాలు ఆప్యాయత లేని ప్రేమలు ఎదురు చూడలేని ఓపికలు...
ఈ ఆనందం ఎవరి ఆహ్వానం వల్లనో !!

ఈ ఆనందం ఎవరి ఆహ్వానం వల్లనో !!

బిగిసిన పెదవుల వెంటనా పదాలు అలసిన చెమటల వెంటనా ఆతృత కలిసిన రెప్పల వెంటనా కలలు తెలిసెనే నీవు చెప్పకనే!! చెదరని నీటిలో ప్రతిలా బెదిరిన ఆకులో వణుకులా ఎదురున వాకిట్లో వల్లిలా పోలికలేని ఈ పలుకులేలనే !! ఆక్షరం అక్షరం ఒకటై పదమై పదము పదము ఒకటై పద్యమై పద్యము పద్యము ఒకటై పాఠమై...
నేనేమౌతున్న

నేనేమౌతున్న

చప్పుడు లేకపోయినా వింటున్న, ఆకలి లేకపోయినా తింటున్న డబ్బులు లేకపోయినా కొంటున్న, కలలు రాకపోయినా కంటున్న సందర్భం లేకపోయినా నవ్వుకుంటున్న, వెలుతురు లేకపోయినా వెతుకుతున్న అదిరి పడకపోయినా అరుస్తున్న, అవసరం లేకపోయినా అదిరిపడ్తున్న అందరుండినా ఒంటరినైయ్య , ఒంటరిగా ఆడుతున్న...
అమ్మా – ఇది నీకు

అమ్మా – ఇది నీకు

నీ ఆకలికి మొదటి అన్నం అమ్మ పాలు నీ జలుబుకి మొదటి రుమాలు అమ్మ కొంగు నీ జ్వరానికి మొదటి థర్మామీటర్ అమ్మ చేయి నీ నిద్దురకి మొదటి పరుపు అమ్మ ఒడి నీ చెవులకి మొదటి సంగీతం అమ్మ లాలి నీ నడకకి మొదటి అడుగు అమ్మ పిలుపు నీ గెలుపుకి మొదటి గుర్తింపు అమ్మ నవ్వు నీ ఓటమికి మొదటి...