దీపావళి

“ఎలా బతికితే ఏంటి ? అందరితో కలిసి ఎలాగోలా బతికామా..!! చచ్చామా..!!” ఇలా అనుకొనే చాల మంది బతికేస్తున్నారు.. బతుక్కుకి ఒక అర్ధం పర్దం ఉండక్కర్లెదా?? “ఈ రోజుల్లో మనిషి గా బతకటం అంత సులభం కాద”ని నేను నా తల్లి గర్భం నుండి బయటపడ్డ రెండు గంటలకే తెలిసింది. ఎందుకంటే నన్ను కన్నతల్లి నన్ను రోడ్ మీద వదిలి వెళ్ళిపోయింది గ.. “ఇప్పుడు నేనేమి చేయాలి???” అని ఆలోచించినా, “నాకు నడక రాదే.. కేకలు తప్ప […]

by NaSo

Jan 14, 2016

“ఎలా బతికితే ఏంటి ? అందరితో కలిసి ఎలాగోలా బతికామా..!! చచ్చామా..!!”
ఇలా అనుకొనే చాల మంది బతికేస్తున్నారు.. బతుక్కుకి ఒక అర్ధం పర్దం ఉండక్కర్లెదా??

“ఈ రోజుల్లో మనిషి గా బతకటం అంత సులభం కాద”ని నేను నా తల్లి గర్భం నుండి బయటపడ్డ రెండు గంటలకే తెలిసింది.

ఎందుకంటే నన్ను కన్నతల్లి నన్ను రోడ్ మీద వదిలి వెళ్ళిపోయింది గ..
“ఇప్పుడు నేనేమి చేయాలి???” అని ఆలోచించినా,
“నాకు నడక రాదే.. కేకలు తప్ప ఇంకేమి పెట్టలేనే..” అని అనుకుంటున్న సమయం లో,

“మనిషి కి ఇంకొక మనిషి నుండి సాయం దొరుకుతుంది” అని రుజువు చేయటానికి నా దగ్గరకి ఒక మంచి మనసున్న మనిషి వచ్చి,

నన్ను ఒక ఆశ్రమం లో చేర్చి నాకు ఒక దారి చూపించి, ఏదో ఒక ఆశయాన్ని సాధించమని,

దీవించి వెళ్ళిపోతూ తను వీర మరణం పొంది, “మనిషి జన్మించాక, చనిపోవక తప్పదు” అని నిరూపించాడు,

అనుకోనేలోపే కులమత బేధాలు ఎన్నో అనర్దాలకి దారి తీస్తోందని, తన శరీరాన్ని దహనం చేయకుండా అడ్డుకున్నప్పుడు,

తెలుసుకున్ననాకు ఈ మానవజాతి ని చూసి, ఇలాంటి వింత జాతిని పుట్టించిన ఆ దేవుడ్ని తిడితే,

మళ్లీ నన్ను నేను తిట్టుకున్నట్టు ఉంటుందని, నా మనస్సాక్షిని చంపుకొని, నా ఈ జీవితాన్ని ఇలా బతికేస్తున్నపుడు అర్ధమయ్యింది.

“ప్రతి ఒక్కరు ఎలా వాళ్ళ వాళ్ళ సంతోషాలని దూరం చేసుకుంటూ, పనికిమాలిన ఈ సమాజం లో బానిసల్లాగా బతుకుతూ,

ఒకడు మనల్ని తొక్కేసి మనల్నే పరిపాలిస్తుంటే, చూస్తూ ఉరుకుంటూ సర్డుకుపోతున్న ఈ సమాజాన్ని నవ సమాజం గా మార్చాలంటే ఎన్ని సంవత్సరాలు పోయినా,

మనలో మార్పు రాదు..ఒక వేళ వస్తుందనుకొనే లోపే, మనం మారిపోతాం” అని తెలుసుకున్న “నేను ఈ సమాజాన్ని ఎలా ఐనా మార్చేస్తాను,

మార్చేయాలి” అని నాలా అనుకున్న యువకులతో కలిసి ఒక ఉద్యమాన్ని లేవనెత్తాలని తలించిన నాకు ఎదురుదెబ్బే తగిలింది .. ఎలా అంటారా??

“మంచి వున్న చోట చెడు ఉండాలనే ఒక దృడ సంకల్పాన్ని” ఏర్పరుచుకున్న కొంత మంది చీడ పురుగుల వల్ల ఆ ఉద్యమాన్ని నక్సలిజం గా తయారు చేసి,

ఈ ప్రపంచాన్ని, మానవత్వ విలువలని మంట గలుపుతున్న కొన్ని రాజకీయ శక్తులని నాశనం చేయకుండా, అమాయకపు ప్రజలని,

వరదలు, తుఫానుల రూపం లో ఆడుకుంటున్న ప్రకృతి దేవుడు మీద కోపం తో ఈ ప్రకృతి నే నాశనం చేయాలని పూనుకున్న నేను,

ఈ రోజు ప్రకృతి కి విరుద్దం గా ఏ పనీ చేయకూడదని నా మనసుని మార్చుకొని, టపాకాయలు, బాంబులు పేల్చకుండా ప్రశాంతం గా దీపాలని మా ఇంటిలో వెలిగించి,

మా ఇంటికి ఒక వెలుగు తీసుకురావాలని ఆ దేవుణ్ణి
” మా ఇంటికే కాదు, అందరి ఇళ్ళలోనూ వెలుగులు నింపాలని”
వేడుకుంటూ “దీపావళి” పండగని జరుపుకుంటున్న నేను మీ అందరికి ఒకటే చెప్పదలుచుకున్నది..
“ఆనందం అనేది ఇంకొకరికి ఎలాంటి కీడు చేయకుండా ఉన్నప్పుడే వస్తుంది”..

అందరికి
దీపావళి శుభాకాంక్షలు..
ఇట్లు
కల్పిత పాత్ర

Note: Written on occasion of Deepawali.

About the Author

Related Posts

Mudat

Kuch ehsas mile Kuch jazbaat mile Sukun mein aaj hume yeh Ek Mudat k baad mile Kuch khamoshi bhare Kuch junoon k halat mile Sukun mein aaj hume yeh Ek Mudat k baad mile Ek javab tha hathon mein hamare Kai usko leke sawal they Kuch shaksh they apne se Aur kuch apno k...

Judge
Judge

Judge Before you decide to be mean and rude Know that they starve Despite having food Before you teach them Right and wrong Know what possibly broke them Was being too strong Before you validate Their bonds as unreal Try to understand The depth of what they feel Know...

Our True Star!
Our True Star!

 A tribute to the INDIAN Soldier, Our True Star! I sleep in the comfort of my home while you stand watch at the border I weep in the comfort of my loved ones while you dedicate your life to following an order   I complain of hot and cold weather while you stay put in...

Comments

0 Comments