కలి కాలపు కవలల్లారా – జై జవాన్ జై కిసాన్

JaiJawanJaiKisan

కలి కాలపు కవలల్లారా  – జై జవాన్ జై కిసాన్

అమ్మ వోలె ముద్ద పెట్టి కడుపు నింపునొకడు

నాన్న వోలె కన్నులుంచి నిద్ర పుచ్చునొకడు

చేలు పంట కలుపు తీయునొకడు

దేశ కంట నలుసు తీయునింకొకడు

కలి కాలపు కవలల్లారా  – జై జవాన్ జై కిసాన్  

అలుపు లేదు, సొలపు లేదు, పని అనే ధ్యాస తప్ప

కులము లేదు, మతము లేదు, మనుషులనే జాతి తప్ప

నాది లేదు, నీది లేదు, మనం అనే మాట తప్ప

కలి కాలపు కవలల్లారా  – జై జవాన్ జై కిసాన్

రేయి లేదు, పగలు లేదు, రోజులనే లెక్క లేదు

మురికి లేదు, మరక లేదు, నరకమనే చిక్కు లేదు

ఎండ లేదు, వాన లేదు, కాలమేదని గుర్తు లేదు

కలి కాలపు కవలల్లారా  – జై జవాన్ జై కిసాన్ 

Comments are closed.