కులం – ఓ స్వార్థపు గోడ

గీసే చెట్టుకో కులం, కోసే చెక్కకో కులం 

నేసే బట్టకో కులం, చేసే బుట్టకో కులం 

పట్టే చేపకో కులం, కుట్టే బట్టకో కులం 

మలిచే కుండకో కులం,పగిలే బండకో కులం 


హరికో  కులం, హరునికో కులం 

ఇనుముకో కులం, వనముకో కులం 

శవానికో కులం, కనకానికో కులం 

తోలుకో కులం, రోలుకో కులం 


పీల్చే గాలికి, తాగే నీటికి, నడిచే నేలకి లేదేది మరి కులం ?

సేద్యానికి, వైద్యానికి, నైవేద్యానికి లేదేది మరి కులం ?


విద్యకి కులం, వృత్తికి కులం, ఉద్యోగానికీ కులం 

రాచరికానికీ కులం, రాజకీయానికీ కులం.. 

పాలకులం, ఏలకులం అన్న వారికి ఏల కులం ?


కులం కారుచిచ్చు, కులం కడుపుమాడ్చు, కులం పరువుజార్చు, కులం హతమార్చు 


పారదోలలేక ఈ  కులమును, ఫారిన్ (foreign) ఎల్లిపోయే యువకులు.. 


అందుకే కులం నినాదం కాదు, వివాదం…

222 COMMENTS

  1. అసలు నరునికేల ఈ కులం

    మనుషులు ఈ కుల వ్యవస్థనుండి కనువిప్పు పొందాలి

Comments are closed.