మనసెంత విచిత్రమైంది ??
నిన్న తీపి అన్నది అనుకున్నది, నేడు చేదైంది
నిన్న నువ్వు లేక నేను లేనన్నది, నేడు నువ్వెవ్వరన్నది
నిన్న నిన్ను నన్నుగా చూపింది, నేడు నన్ను మొన్నటి నన్నును చేసింది
మనసెంత విచిత్రమైంది ??
ప్రకృతి ధర్మాన్ని గుర్తుచేస్తుంది, కొత్తదనం పాతదనాన్ని మరిపిస్తుంది
తప్పుని చేయిస్తుంది, అది తప్పని తెలియచేస్తుంది
తప్పుని తెలుసుకున్నవాడికి, ఒప్పుని అప్పచెప్తుంది
మనసెంత విచిత్రమైంది ??
కలల్ని కంటుంది, కనీళ్ళు తెప్పిస్తుంది, కళల్ని బయటపెడుతుంది
కష్టపడితే ఫలితాన్నిస్తుంది, ఇష్టపడి కష్టపడితే ఐశ్వర్యాన్నిస్తుంది
కోరుకుంటే కారణమడుగుతుంది, కాదన్నదే కోరుకుంటుంది
మనసెంత విచిత్రమైంది ??
Superb one…Very nice….