మేలుకో ఇకనైనా

  తగలబెట్టుకో… తగలబెట్టుకో… నీ ఆస్తిని నువ్వే తగలబెట్టుకో.. కూల్చుకో… కూల్చుకో… నీ సమాజాన్ని నువ్వే కూల్చుకో.. మంటగల్పుకో… మంటగల్పుకో… నీ ఆత్మ గౌరవాన్ని నువ్వే మంటగల్పుకో.. లేవనెత్తుకో … లేవనెత్తుకో … పనికి రాని ఉద్యమాలని లేవనెత్తుకో .. ఎందుకు… ఎందుకు… జరగబోదు దాని గూర్చి చింత ఎందుకు.. నీకు తెలుసు… నాకు తెలుసు… జరిగింది  ఏంటో.. జరిగేది  ఏంటో.. అయినా గాని మనం మారము.. ముందు తరాన్ని అయినా  మార్చము.. ఇంకెందుకు… ఇంకెందుకు… ఈ […]

by NaSo

Feb 2, 2016

 

తగలబెట్టుకో… తగలబెట్టుకో…

నీ ఆస్తిని నువ్వే తగలబెట్టుకో..

కూల్చుకో… కూల్చుకో…

నీ సమాజాన్ని నువ్వే కూల్చుకో..

మంటగల్పుకో… మంటగల్పుకో…

నీ ఆత్మ గౌరవాన్ని నువ్వే మంటగల్పుకో..

లేవనెత్తుకో … లేవనెత్తుకో …

పనికి రాని ఉద్యమాలని లేవనెత్తుకో ..

ఎందుకు… ఎందుకు…

జరగబోదు దాని గూర్చి చింత ఎందుకు..

నీకు తెలుసు… నాకు తెలుసు…

జరిగింది  ఏంటో.. జరిగేది  ఏంటో..

అయినా గాని మనం మారము..

ముందు తరాన్ని అయినా  మార్చము..

ఇంకెందుకు… ఇంకెందుకు…

ఈ గర్జనలు , ఈ ఉద్యమాలు..

గర్వించుకో… గర్వించుకో…

నీవు భారతీయుడవని గర్వించుకో..

పాటుపడు… పాటుపడు…

కుల వ్యవస్థ నిర్మూలనకి పాటుపడు..

కట్టడి చేయు.. కట్టడి చేయు..

ఈ అరాచకాలని కట్టడి చేయు..

అడ్డుకో… అడ్డుకో…

ఈ కుట్రపు రాజకీయాలని అడ్డుకో..

తెంచుకో… తెంచుకో…

నీలోని ఆవేశాన్ని తెంచుకో..

నడిపించు… నడిపించు…

ఈ నవ భారతాన్ని ముందుకి నడిపించు..

కాని ఒక్కసారి ఆలోచించు..

నువ్వు చేసేది ఏదీ కూడా నీ కోసం కాదని..

గుర్తు పెట్టుకో… గుర్తు పెట్టుకో…

నీవే రేపటి పౌరుడివని!

About the Author

Related Posts

जन्नत की आस
जन्नत की आस

Jannat ki Aas (जन्नत की आस) - by Sailee Brahme हर मुल्क में, हर सदी में हर शक्स जन्नत पाने की आस लगाए बैठा है वह जन्नत, जहाँ शांती है और खुशहाली भी जहां इंसानीयत और ईमान बिकते नहीं पर वह हासिल करने में हर कोई यह क्यों भूल जाता है की धर्ती पर ही जन्नत है, और जहन्नुम...

ఈ మాట నాది కాదు (E Maata Nadi Kadu)
ఈ మాట నాది కాదు (E Maata Nadi Kadu)

E Maata Nadi Kadu (ఈ మాట నాది కాదు) కోరితే తీరేది కోరిక కాదు, చేరితే చేరేది గమ్యం కాదు, మర్చితే పోయేది జ్ఞ్యాపకం కాదు, ఈ మాట నాది కాదు, నీది కాదు, నీతి కాదు !! వ్యథ లేని జీవితం వ్యర్థం, ఎదురు లేని మనిషి శూన్యం, దెబ్బ లేని పయనం అశేషం,  ఈ మాట నాది కాదు, నీది కాదు, నీతి...

ఏది జీవితం ?
ఏది జీవితం ?

సమాధానం లేని ప్రశ్నలు అర్థం లేని సంకేతాలు ముగింపు లేని పరుగులు అవసరం లేని అనుమానాలు నిజాలు లేని నమ్మకాలు ఎల్లలు లేని కోరికలు                                           ఇదేనా జీవితం !! వేళలు లేని వేడుకలు విలువలు లేని గౌరవాలు ఆప్యాయత లేని ప్రేమలు ఎదురు చూడలేని ఓపికలు...

Comments

2 Comments

  1. Gopi Krishna

    “నువ్వు చేసేది ఏదీ కూడా నీ కోసం కాదని గుర్తు పెట్టుకో ” absolutely true.
    People are spoiling their own society

  2. NaSo

    బాగా catch చేసావు.. :)