చప్పుడు లేకపోయినా వింటున్న, ఆకలి లేకపోయినా తింటున్న
డబ్బులు లేకపోయినా కొంటున్న, కలలు రాకపోయినా కంటున్న
సందర్భం లేకపోయినా నవ్వుకుంటున్న, వెలుతురు లేకపోయినా వెతుకుతున్న
అదిరి పడకపోయినా అరుస్తున్న, అవసరం లేకపోయినా అదిరిపడ్తున్న
అందరుండినా ఒంటరినైయ్య , ఒంటరిగా ఆడుతున్న
చిలిపికి చిరునామానైయ్య, ఆవేశానికి అర్థానౌతున్న
అల్పుల్లో మూర్ఖునౌతున్న, మంచోళ్ళలో మేథావినౌతున్న
ఆలోచిస్తున్న, తపిస్తున్న, బ్రమిస్తున్న, భయపడుతున్న
ఇన్ని అవుతున్నా కారణం కనుక్కోలేక ఉన్న
0 Comments