రైతన్నా – నీకే అంకితం

ఆంధ్రాలో  ఐనా అమెరికాలోనైనా  ఆకలి తీర్చే అన్నదాతదే అగ్రస్థానం… అట్టి అవతారునికే ఆకలి అలమటా ?? రైతే రాజు, రైతుదే రాజ్యం అన్నది రాజకీయం… అట్టి రారాజుకే రొట్టె దొరకని వైనమా?? పంటనే పత్నిగా, పనినే ప్రాణంగా భావించే పుణ్యాత్ముడు… అట్టి పౌరునికి పురుగులమందు పాయసమా?? తాను పస్తులుండి మనకు ఫలహారన్నిచ్చే పరోపకారుడు… అట్టి పురుషోత్తముడికి పాడె పరుపు పడకా?? భాదలన్ని భరించి భూమి బ్రతుకు బువ్వనిచ్చు భూభటువు … అట్టి ఉత్తముడికి ఉరికొయ్యే  ఉయ్యాలా?? అయ్యో       […]

Nov 23, 2015

ఆంధ్రాలో  ఐనా అమెరికాలోనైనా  ఆకలి తీర్చే అన్నదాతదే అగ్రస్థానం… అట్టి అవతారునికే ఆకలి అలమటా ??

రైతే రాజు, రైతుదే రాజ్యం అన్నది రాజకీయం… అట్టి రారాజుకే రొట్టె దొరకని వైనమా??

పంటనే పత్నిగా, పనినే ప్రాణంగా భావించే పుణ్యాత్ముడు… అట్టి పౌరునికి పురుగులమందు పాయసమా??

తాను పస్తులుండి మనకు ఫలహారన్నిచ్చే పరోపకారుడు… అట్టి పురుషోత్తముడికి పాడె పరుపు పడకా??

భాదలన్ని భరించి భూమి బ్రతుకు బువ్వనిచ్చు భూభటువు … అట్టి ఉత్తముడికి ఉరికొయ్యే  ఉయ్యాలా??

అయ్యో

                      కంటి ముందు కరువు కరగదాయె, కంటి నీరు పంట సరి తూగదాయె..

                      కారు లేని నాడు కాళ్లు దిక్కు, కర్షకుడు లేని నాడు ఎవడు దిక్కు??

About the Author

Related Posts

जन्नत की आस
जन्नत की आस

Jannat ki Aas (जन्नत की आस) - by Sailee Brahme हर मुल्क में, हर सदी में हर शक्स जन्नत पाने की आस लगाए बैठा है वह जन्नत, जहाँ शांती है और खुशहाली भी जहां इंसानीयत और ईमान बिकते नहीं पर वह हासिल करने में हर कोई यह क्यों भूल जाता है की धर्ती पर ही जन्नत है, और जहन्नुम...

ఈ మాట నాది కాదు (E Maata Nadi Kadu)
ఈ మాట నాది కాదు (E Maata Nadi Kadu)

E Maata Nadi Kadu (ఈ మాట నాది కాదు) కోరితే తీరేది కోరిక కాదు, చేరితే చేరేది గమ్యం కాదు, మర్చితే పోయేది జ్ఞ్యాపకం కాదు, ఈ మాట నాది కాదు, నీది కాదు, నీతి కాదు !! వ్యథ లేని జీవితం వ్యర్థం, ఎదురు లేని మనిషి శూన్యం, దెబ్బ లేని పయనం అశేషం,  ఈ మాట నాది కాదు, నీది కాదు, నీతి...

ఏది జీవితం ?
ఏది జీవితం ?

సమాధానం లేని ప్రశ్నలు అర్థం లేని సంకేతాలు ముగింపు లేని పరుగులు అవసరం లేని అనుమానాలు నిజాలు లేని నమ్మకాలు ఎల్లలు లేని కోరికలు                                           ఇదేనా జీవితం !! వేళలు లేని వేడుకలు విలువలు లేని గౌరవాలు ఆప్యాయత లేని ప్రేమలు ఎదురు చూడలేని ఓపికలు...

Comments

0 Comments