సమాధానం లేని ప్రశ్నలు
అర్థం లేని సంకేతాలు
ముగింపు లేని పరుగులు
అవసరం లేని అనుమానాలు
నిజాలు లేని నమ్మకాలు
ఎల్లలు లేని కోరికలు
ఇదేనా జీవితం !!
వేళలు లేని వేడుకలు
విలువలు లేని గౌరవాలు
ఆప్యాయత లేని ప్రేమలు
ఎదురు చూడలేని ఓపికలు
వాడుక తెలియని వస్తువులు
జ్ఞాపకాలు లేని గతాలు
ఇదేనా జీవితం !!
0 Comments