మరువను మరువలేను

మరువను మరువలేను, ఈ జన్మకు నేనిక మరువలేను, నా మనసు తలపులు తట్టిన క్షణమది, గమ్యంలేని ప్రయాణమది, మిణుగురు పురుగుల వెలుతురులో, కారుచీకటిని చీల్చుకుని వెళుతున్న ప్రయాణమది, నిర్మానుష్యమైన ప్రదేశంలో విశాలవంతమైన ప్రపంచంలో సాగుతుందాపయనం, గగనం నుండి నా నుదుటిపై ఆ వర్షపు బిందువు రాలిపడినక్షణాన, తనచేయి నా భుజంపై వేసింది, అది కలయో నిజమోనన్న భ్రమలోనున్న సమయమది, ఉరుము ఉరిమి, మెరుపు మెరిసి, చిరుజల్లు కురిసింది, ఒక్కసారిగ ఉలిక్కిపడ్డ ఆమె హఠాత్తుగా వెనుకనుండి నన్ను గట్టిగా […]

Nov 12, 2015

మరువను మరువలేను,

ఈ జన్మకు నేనిక మరువలేను,

నా మనసు తలపులు తట్టిన క్షణమది,

గమ్యంలేని ప్రయాణమది,

మిణుగురు పురుగుల వెలుతురులో,

కారుచీకటిని చీల్చుకుని వెళుతున్న ప్రయాణమది,

నిర్మానుష్యమైన ప్రదేశంలో విశాలవంతమైన ప్రపంచంలో సాగుతుందాపయనం,

గగనం నుండి నా నుదుటిపై ఆ వర్షపు బిందువు రాలిపడినక్షణాన,

తనచేయి నా భుజంపై వేసింది,

అది కలయో నిజమోనన్న భ్రమలోనున్న సమయమది,

ఉరుము ఉరిమి, మెరుపు మెరిసి, చిరుజల్లు కురిసింది,

ఒక్కసారిగ ఉలిక్కిపడ్డ ఆమె హఠాత్తుగా వెనుకనుండి నన్ను గట్టిగా హత్తుకుంది,

ఆ ఒక్క క్షణముకి నా జన్మజన్మలు ఋణపడియున్నవి,

ఆ ఒక్కక్షణం ప్రపంచమంతా నా గుప్పిటలో ఉందన్నభావన,

ఈ ప్రపంచాన్ని జయించిన ఆత్మవిశ్వాసం,

మరువను మరువలేను,

మరిచివుండలేను ఈ జన్మకి… నేనిక మరువలేను…

About the Author

Related Posts

जन्नत की आस
जन्नत की आस

Jannat ki Aas (जन्नत की आस) - by Sailee Brahme हर मुल्क में, हर सदी में हर शक्स जन्नत पाने की आस लगाए बैठा है वह जन्नत, जहाँ शांती है और खुशहाली भी जहां इंसानीयत और ईमान बिकते नहीं पर वह हासिल करने में हर कोई यह क्यों भूल जाता है की धर्ती पर ही जन्नत है, और जहन्नुम...

ఈ మాట నాది కాదు (E Maata Nadi Kadu)
ఈ మాట నాది కాదు (E Maata Nadi Kadu)

E Maata Nadi Kadu (ఈ మాట నాది కాదు) కోరితే తీరేది కోరిక కాదు, చేరితే చేరేది గమ్యం కాదు, మర్చితే పోయేది జ్ఞ్యాపకం కాదు, ఈ మాట నాది కాదు, నీది కాదు, నీతి కాదు !! వ్యథ లేని జీవితం వ్యర్థం, ఎదురు లేని మనిషి శూన్యం, దెబ్బ లేని పయనం అశేషం,  ఈ మాట నాది కాదు, నీది కాదు, నీతి...

ఏది జీవితం ?
ఏది జీవితం ?

సమాధానం లేని ప్రశ్నలు అర్థం లేని సంకేతాలు ముగింపు లేని పరుగులు అవసరం లేని అనుమానాలు నిజాలు లేని నమ్మకాలు ఎల్లలు లేని కోరికలు                                           ఇదేనా జీవితం !! వేళలు లేని వేడుకలు విలువలు లేని గౌరవాలు ఆప్యాయత లేని ప్రేమలు ఎదురు చూడలేని ఓపికలు...

Comments

1 Comment

  1. Carola

    Ridiculous quest there. What happened after?Good luck!